Thursday, March 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండీఎస్‌హెచ్‌ ఏర్పాటు హర్షనీయం

డీఎస్‌హెచ్‌ ఏర్పాటు హర్షనీయం

- Advertisement -

– మంత్రి దామోదర్‌ రాజనర్సింహకు, కమిషనర్‌ అజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు
తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ సర్వీసెస్‌ ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) తెలిపింది. ఈ మేరకు ఆ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌, అధ్యక్షులు ఫస్యుద్దీన్‌, ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్‌, వైద్యవిధాన పరిషత్‌ విభాగం కార్యదర్శి బైరపాక శ్రీనివాస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్‌హెచ్‌ ఏర్పాటు విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, కమిషనర్‌ అజరుకుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్లు, ఉద్యోగులు చేసిన పోరాటం ఫలించిందని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలోని ఇతర విభాగాల లాగానే ప్రజలకు అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ వారు వివక్ష ఎదుర్కొన్నారని తెలిపారు. అన్ని సంఘాలతో కలిసి జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన పోరాటం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో విజయం సాధించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు అందే వైద్య సేవల్లో కూడా మౌలికమైన మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో శాస్త్రీయమైన కేడర్‌ స్ట్రెంగ్త్‌ ఏర్పాటుకు కృషి జరగాలనీ, మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రస్థానం ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -