– జిల్లా కలెక్టర్‌కు ప్రజా సంఘాల వినతి
నవతెలంగాణ -పరకాల : ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ వివిధ విద్యార్థి, ప్రజా, తల్లిదండ్రుల సంఘాల నాయకులు హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, విద్యాభివృద్ధి వల్లే సమాజం పురోగతి సాధిస్తుందని వారు పేర్కొన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందని ద్రాక్షలా మారకూడదని, ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకుని ఫీజులను నియంత్రించే చట్టాన్ని తేవాలని వారు డిమాండ్ చేశారు. విద్యాసంస్థల దోపిడీని అడ్డుకుని, సామాన్యులకు కూడా మెరుగైన విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒంటేరు చక్రి, ఇసంపెల్లి సంజీవ, డుడపాక నరేష్, పుష్ప బిక్షపతి, ప్రదీప్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



