గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం 

– మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ 
మండలంలోని సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా భావించి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పది సంవత్సరాలు పాలించిన గత పాలకులు గ్రామాలను అభివృద్ధి చేయలేకపోయారని అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు విసిగిపోయి ప్రజల మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని గ్రహించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోకి అధికారంలోకి తెచ్చారన్నారు. మండల కేంద్రంలోని సర్వీస్ రోడ్ నుండి పాపారేశ్వర మందిర్ వరకు 30 లక్షల వ్యయంతో ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధుల ద్వారా పనులు ప్రారంభించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శామప్ప పటేల్,అక్కల్ సాయి రెడ్డి,చిప్ప మోహన్, కల్లూరు పండరి,బసవరాజ్ దేశాయ్, సంతోష్ దేశాయ్, సంజీవ్,విట్టల్,రషీద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love