– అంబేడ్కర్,మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు
నవతెలంగాణ – బెజ్జంకి
మహానీయులను అవమానిస్తూ..ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలిచిన భారత ర్యాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతోందని, అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని..రాజ్యాంగం ద్వార సంక్రమించిన ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహనికి పూలమాల వేసి జై బాఫు..జై భీమ్..సంవిధాన్ యాత్రను రత్నాకర్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి గుండారం గ్రామ వరకు యాత్ర సాగించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే దేశానికి రక్షణ కవచమని కాంగ్రెస్ శ్రేణులు కొనియాడారు. ఏఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్, నాయకులు రొడ్డ మల్లేశం, బైరి సంతోష్,శెట్టి రాజు, గూడెల్లి శ్రీకాంత్, అయా గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు.