
నవతెలంగాణ – బెజ్జంకి
రైతు సంక్షేమానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సటయమనంతో కృషి చేస్తోందని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోల కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్ధతు ధర పొందాలని ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని వడ్లూర్ గ్రామంలో పీఏసీఎస్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ ఛైర్మన్ పులి క్రిష్ణ, పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు డైరెక్టర్లు, సిబ్బందితో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకుడు పులి రమేశ్, రైతులు పాల్గొన్నారు.