ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వేంటనే అమలుచేయాలి : టిపీఏఫ్

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ ప్రజా ఫ్రంట్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం  జిల్లా కేంద్రంలో జిల్లా సమన్వయ కర్త బట్టు రామచంద్రయ్య   అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రజా ఫ్రంట్  జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాశపాక మహేష్  రాసాల నర్సింహ్మా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు చేయాలని చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను గెలిచి సంవత్సర కాలం దాటుతున్నా అమలు విషయంలో మాత్రం ప్రజలను మోసం చేసిందనారు. ప్రధానంగా రైతాంగానికి అవసరమైన రైతు భరోసా పథం ద్వారా ఇచ్చే పెట్టుబడి సాయం విషయంలో తీవ్ర జాప్యం చేస్తుందనీ,  ఋణమాఫీకి సంబంధించి చాలా మంది రైతులకు ఇంకా లోను మాఫీ కాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారనీ అన్నారు.   కౌలు రైతులను ప్రభుత్వం అసలే గుర్తించకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని , ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.  ఇతర పథకాల గురించి మాట్లాడుతూ  ప్రభుత్వం ఇటీవల గ్రామ సభల ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలో అనేకమంది అనర్హులే ఉన్నారు.  ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి అర్హులగా ఉన్నవారి పేర్లను గ్రామసభలో ప్రవేశపెట్టిన జాబితా నుండి తొలగించడం జరిగిందనీ,   రేషన్ కార్డులు ఏ ప్రాతిపాదికన ఇస్తున్నారో తెలియడంలేదనీ, అర్హులైన పేదలకు రేషన్ కార్డు జాబితాలో పేరు లేదని, వివిధ విభాగాలలో ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి కుటుంబాలకు , ఏడు, పది ఎకరాలకు పైగా భూములు ఉన్నటువంటి మధ్య ధనిక రైతులకు కూడా రేషన్ కార్డు జాబితాలో పేరు లభించిందనారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి  మహిళలు 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులైనా పని చేసి ఉండాలి అనే నిబంధనను తీసుకువచ్చారని అన్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో నాన్ అగ్రికల్చర్ భూమిని పూర్తిస్థాయిలో గుర్తించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారనీ,  ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల ఇలాంటి తప్పుడు వైఖరి వల్ల అనేకమంది హరులు అయినటువంటి పేద ప్రజలు ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు కనుక ప్రభుత్వం గ్రామ సభలో ప్రవేశపెట్టిన జాబితాలను సరిచేసి, అర్హులందరికీ  సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని , లేని పక్షంలో పేదల పక్షాన తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నా ప్రదర్శనాలు నిర్వహిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కావాలి యాదయ్య, సహాయ కార్యదర్శి రాసాల బాలస్వామి, చిక్కుల కరుణాకర్ లు పాల్గొన్నారు.
Spread the love