ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవాలి..

The government should take advantage of the opportunity provided.– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ – కామారెడ్డి
అనధికార లే అవుట్లు, వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని దరఖాస్తు దారులు సద్వినియోగ పరుచుకునే విధంగా సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం కామారెడ్డి మునిసిపాలిటీ లో ఎల్.ఆర్.ఎస్. హెల్ప్ లైన్ డెస్క్ లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లే అవుట్లు, ప్లాట్ల రెగ్యులరైస్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్ల ద్వారా సమాచారం అందించాలని తెలిపారు. మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పిస్తున్న రిబేట్ గురించి విస్తృతంగా దరఖాస్తుదారులకు తెలిసే విధంగా ప్రచారం చేయాలనీ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఎల్.ఆర్.ఎస్. పై ఏర్పాటుచేసిన కౌంటర్ లను కలెక్టర్ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతీ దరఖాస్తు డారునికి సమాచారం అందించి, రీబేట్ గురించి తెలియజేయాలని అన్నారు. ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. ప్రతీ రోజూ ఎల్.ఆర్.ఎస్.పై సమీక్షించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ను ఆదేశించారు.
పారిశుద్ధ్యం పై మాట్లాడుతూ… 
పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని తెలిపారు. వేసవి కాలం దృష్ట్యా మొక్కలకు వాటరింగ్ నిర్వహించాలని అన్నారు. అవసరమైన ట్యాంకర్ లను కొనుగోలు చేయాలనీ ఇప్పటికే చెప్పడం జరిగిందని, పార్కు ల్లో చిన్న పిల్లలు ఆదుకునేందుకు, జిమ్ వంటివి ఏర్పాటుచేయాలని తెలుపడం జరిగిందని, వాటిని తొందరగా ఏర్పాటు చేయాలని తెలిపారు.  వేసవికాలం నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అద్దె పై బోరుబావులు గుర్తించాలని సూచించారు. అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని అన్నారు. హరిత హారం  క్రింద నాటిన మొక్కలను సంరక్షించాలనీ తెలిపారు.  పట్టణంలో అనధికారికంగా ఏర్పాటుచేసిన హార్డింగ్స్ లను తొలగించాలని, పర్మిషన్ ఉన్న హోర్డింగ్స్ లపై ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసుకొనుటకు అనుమతించాలని తెలిపారు. డిమాండు మేరకు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాలనీ తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ వేణు గోపాల్, సహాయ ఇంజనీర్ శంకర్, టీ.పి.ఎస్. గిరిధర్, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love