ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి..

The government's decision should be withdrawn.– ముందస్తుగా అరెస్టు అయిన నాయకులను విడుదల చేయాలి….
– ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,  కార్యదర్శులు చింతల శివ, లావుడియ రాజు….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ప్రభుత్వం అమ్మోద్దని నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని విద్యార్థి సంఘాల చలో సెక్రటేరియట్ పిలుపుమేరకు ముందస్తుగా అరెస్ట్ అయిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలని  జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ లావుడియ రాజు అన్నారు. గురువారం రోజున భువనగిరి జిల్లా  కేంద్రంలోని సుందరయ్య భవనంలో విలేకరుల సమావేశం మాట్లాడుతూ  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని వేలంపాట విరమించుకోవాలని, ప్రభుత్వం నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం యొక్క  వైఖరి  విడాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల వేలను  ఆపాలని వందలాది మంది పోలీసులు, జేసీబీలు, బుల్డోజర్లతో వేలాది వృక్షాలను నెలకూర్చడంతోపాటు, నెమళ్ళు, దుప్పులు, జింకలు అరుదైన పక్షిజతులను అక్కడి నుంచి తరలించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాపాలన ప్రభుత్వం రాష్ట్రంలో ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోడ్లమీద వచ్చి నిరసన తెలియజేస్తే ఎక్కడికి అక్కడ అరెస్టులు వేసి నిర్బంధాలను కొనసాగించడం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నామని , ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది మేధావులను తయారు చేసే యూనివర్సిటీ భూములను వేలం వెయ్యడం సరైన నిర్ణయం కాదని వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలినీ ప్రభుత్వంనీ డిమాండ్ చేశారు, ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ గురువారం  ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ను పిలుపునివ్వడం జరిగిందన్నారు.  ముందస్తుగా జిల్లాలో తెల్లవారుజామున నుండి విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేయడం జరిగిందని  ఎస్ఎఫ్ఐ జిల్లా  వ్యాప్తంగా నాయకులను చౌటుప్పల్, వలిగొండ ,ఆలేరు,రామన్నపేట,బొమ్మలరామారం, బీబీనగర్,పోచంపల్లి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు ప్రభుత్వం ఇదే వైఖరిని అవలంబిస్తే రానున్న రోజుల్లో గత ప్రభుత్వం పట్టిన గతే ఈ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని హెచ్చరించారు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఎలుకలు కలుపుతానన్న నెలకొల్పుతాను అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందస్తుగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నావని ప్రశ్నించారని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
Spread the love