– పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్రంలోని పేదల సొంతింటి కల నెరవేర్చడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మండలంలోని పోచారంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఇల్లు లేని పేదలకు భద్రతతో కూడిన నివాస స్థలం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇంటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది కుటుంబాలకు కల తీరుతుందన్నారు. ఇది కేవలం నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదు, అది సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వసతులతో కూడిన గృహ నిర్మాణానికి బలమైన పునాది వేస్తుందన్నారు. ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ముత్యాల పూర్ణచందర్, బానోత్ గోపాల్ నాయక్, సీనియర్ నాయకులు దుంపల శ్యాం, ముత్తినేని శ్రీనివాస్, బానోత్ వెంకన్న, తోటకూరి శ్రీనివాస్, ఉపేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అనపురం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఓరిగంటి సతీష్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీతారాం నాయక్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు కాలేరు కరుణాకర్, అధ్యక్షులు మండల యూత్ అధ్యక్షులు బీసు హరికృష్ణ, మండల యూత్ ఉపాధ్యక్షుడు ఆవుల మహేష్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకుల సమ్మయ్య గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మద్దెల యాకన్న, వెంకన్న, గోపాల్ గ్రామ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రవీణ్, బండారి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.