నవతెలంగాణ – భీంగల్; మండలంలోని పిప్రి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శ్రీ లొద్ది రామన్న కల్యాణ మహోత్సవ వేడుకలకు రావాలని పీసీసీ అధ్యక్షులు భీంగల్ మండల ముద్దుబిడ్డ అయినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ఆహ్వానం పలికారు. పిప్రి గ్రామ డెవలప్మెంట్ కమిటీ వీడీసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబానికి లొద్ది రామన్న ఆలయంతో అనుబంధం ఉందని, అనుబంధం ఉన్న ఆలయ ఉత్సవాల్లో పాల్గొనాలని వీడీసీ సభ్యులు కోరారు. అందుకు స్పందించిన పీసీసీ అధ్యక్షులు తప్పకుండ హాజరుకావడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. పీసీసీ ని కలిసిన వారిలో పిప్రి వీడీసీ సభ్యులు గుర్జికింది లింబాద్రి, గొల్ల లింబన్న, లోక్కిడి అశోక్, ఆరిగేల జనార్దన్, పతాని జేమ్స్, తదితరులు ఉన్నారు.