దొర రాజ్యం పోవాలి.. ప్రజల రాజ్యం రావాలి

 – బీఆర్‌ఎస్‌ని పాతర వేయాలి
–  హుజురాబాద్ ను పివి జిల్లాగా ఏర్పాటు చేస్తాం
– హుజురాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే
– ఈటల రాజేందర్ తట్టెడు మట్టి పోసాడా
– ఎమ్మెల్సీ, కమిషన్ల కోసం కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశాడు
– టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ- జమ్మికుంట: రాష్ట్రంలో కాంగ్రెస్  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, హుజురాబాద్ లో అభ్యర్థి ఒడి తల ప్రణవ్ బాబును గెలిపిస్తే హుజురాబాద్ను పి వి జిల్లా ఏర్పాటు బాధ్యతను ప్రణవ్ తీసుకుంటారని, చంపుకుంటారో సాదుకుంటారో అని ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ కేంద్రం నుంచి ఏమైన నిధులు తీసుకొచ్చాడా అని, ఎమ్మెల్సీ పదవి, కమిషన్ల కోసం కాంగ్రెస్ కి ద్రోహం చేసిన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి అని, దొర రాజ్యం పోవాలి ప్రజల రాజ్యం రావాలని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సుమారు లక్ష మంది హాజరైన కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. హుజూరాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని, నాతో పాటు కోదండ రామ్, బల్మురు వెంకట్ లు వచ్చారని చెప్పారు. ఈ ఎన్నికలు అషామాశి ఎన్నికలు కాదన్నారు. రాజరికపు పాలన ఉండాలా వద్దా అనే అంశాన్ని తెల్చనున్న ఎన్నికలు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే దేశ ప్రధాని పి వి జిల్లా అని తెలిపారు.  ప్రణవ్ బాబు ను గెలిపిస్తే  మాజీ మత్రి దామోదర్ రెడ్డి లాగా అభివృద్ధి చేస్తాడని  చెప్పారు. సాధుకుంట రో, సంపు కుంటా రో అని దొంగ ఏడ్పు, ఏడ్చి గెలిచిన వ్యక్తి ఈటెల రాజేందర్ అని, కేంద్ర  ప్రభుత్వము నుండి ఏమైనా నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు దొందు దొందేనని  అన్నారు. ఈటెల రాజేందర్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత  తట్టెడు మట్టి కూడా పోయలేదని ఆయన విమర్శించారు. ఏడుసార్లు ఈటలను గెలిపించిన కూడా హుజురాబాద్ వద్దనుకొని, గజ్వేల్ కు పోయిండని ఆయన అన్నారు. ఇక్కడ కోవర్టు రాజకీయ నాయకులు ఎక్కువ అని అన్నారు. ఆత్మగౌరవం పేరిట హుజురాబాద్ ప్రజలను నయవంచనకు ఈటల రాజేందర్ గురి చేశాడని ఆయన విమర్శించారు. హుజురాబాద్ అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుండి నయా పైసా తీసుకురాలేని అసమర్ధ నాయకుడని ఈటలను విమర్శించారు. నమ్మి నాన పోస్తే పుచ్చు బుర్రలు అయినట్లు 2018 ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డికి పార్టీ టికెట్ ఇస్తే ఎం ఎల్ సి పదవి, కమిషన్ ల కోసం పార్టీ కి ద్రోహం చేశాడని విమర్శించారు.  కౌశిక్ రెడ్డి ని గెలిపిస్తే 1000 కోట్ల తో అభివృద్ధి చేస్తానని బూటకపు మాటలు చెబుతున్నాడని, ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్లే కదా ఎందుకు చేయలేదని  విమర్శించారు. కౌశిక్ రెడ్డి ఈ ప్రాంత రైతులను ఆదుకోలేదని విమర్శించారు. యువకులకు ఉపాధి లేదన్నారు. ఈటల రాజేందర్ ను, పాడి కౌశిక్ రెడ్డిని మీరు చూశారని, ఒక్కసారి కాంగ్రెస్ అభ్యర్థి కి ఓటు వేసి గెలిపించాలన్నారు. మచ్చ లేని కుటుంభం నుండి వచ్చిన వ్యక్తి ప్రణవ్ అని తెలిపారు. కేటిఆర్ మీ నాన్న నకిలీ వంద రూపాయల నోటే అన్నారు.30 లక్షల మంది నిరుద్యోగులు ఈ కురుక్షేత్రము లో ముందు ఉందని, కేసిఅర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల గురించి  వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. ఇవ్వన్నీ సాధ్యం కావాలి అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణవ్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం, ఓడి తల ప్రణవ్ బాబు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం, ఒడితల పద్మశ్రీ, పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, వెంకన్న, సమ్మిరెడ్డి, సాయిని రవి, దాసరి భూమయ్య, సజ్జు, ఇమ్రాన్, రేణుక, పొన్నగంటి మల్లయ్య తదితరులు ఉన్నారు.
Spread the love