
నవతెలంగాణ-మల్హర్ రావు : మహనీయుల జయంతోత్సవాలు విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజాప్రంట్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బహుజన పితామహులు భారత సామాజిక ఉద్యమ సూర్యుడు,సంఘసంకర్త మహాత్మ జ్యోతిరావు పూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ల జయంతోత్సవ కార్యక్రమాలను శుక్రవారం సింగరేణి ఉద్యోగుల సంఘం బాతాల రాజన్న భవన్ లో ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమాలను అన్ని వర్గాలు ప్రజలు,నాయకులు,మేధావులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.