పల్లెల అభివృద్ధికి పట్టు బిగిస్తున్న ఎమ్మెల్యే..

MLA is focusing on rural development..– సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో ఏఎంసి వైస్ చైర్మన్..

నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గంలోని పల్లెల అభివృద్ధికి ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రత్యేకంగా అభివృద్ధి కోసం పట్టు బిగిస్తున్నారని, గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారని, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల అనుసారంగా మద్నూర్ మండలంలోని చిన్న తడగూర్ గ్రామానికి మంజూరు చేసిన రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, హనుమాన్ టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్, ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు, పాండురంగ పాటిల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండ గంగాధర్, మండల యూత్ అధ్యక్షులు అనుమంతు యాదవ్, సంతోష్ మేస్త్రి, ఆ గ్రామస్తులు బాలాజీ తదితరులతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love