నియోజక వర్గంలో ఎమ్మెల్సీ పోలింగ్ శాతం 77 శాతం..

– శాంతిభద్రతలపై సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్సై శ్రీరాముల శ్రీను…
– మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకున్న పట్ట భద్రుడు మడిపల్లి భౌతిక్
– పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్న తహశీల్దార్ కృష్ణ ప్రసాద్….
– ఓటు చేసేందుకు పోలింగ్ బూతు కు భర్త రాంబాబు తో పాటు వస్తున్న నిండు గర్భిణీ వర్తికా…
– ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్
– పోలింగ్ కేంద్రాల వద్ద 146 సెక్షన్ అమలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది.నియోజక వర్గం వ్యాప్తంగా 71 శాతం పోలింగ్ నమోదు అయింది. అయిదు మండలాలు,ఏడు పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం ఓట్లు 5202 ఓటర్లు ఉండగా 3685 మంది మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.పోలింగ్ శాతం 71 శాతం నమోదు అయింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.ఓటు వేసిన పట్టభద్రులకు సిరా ను ఎడమ చేతి మధ్య వేలికి వేశారు.ఓటు చేసేందుకు పట్టభద్రులు బారులు తీరారు.పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.పోలింగ్ నేపథ్యంలో శాంతి భద్రతల పై ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు ఇస్తూ ఎస్సై శ్రీరాముల శ్రీను పర్యవేక్షించారు. తహశీల్దార్ పి కృష్ణ ప్రసాద్ పోలింగ్ సరళిని పరిశీలించారు.
ములకలపల్లి :
పోలింగ్ స్టేషన్ నెంబర్ – 263
మొత్తం ఓట్లు :808
పోలైన ఓట్లు  : 539
 పోలింగ్ శాతం 67%
దమ్మపేట:
పోలింగ్ స్టేషన్ నెంబర్ : 264
మొత్తం ఓట్లు : 1050
పోలైన ఓట్లు   : 734
పోలింగ్ శాతం 72.
పోలింగ్ స్టేషన్ నెంబర్ : 265
మొత్తం ఓట్లు : 651
పోలైన ఓట్లు   : 447
పోలింగ్ శాతం : 71
అశ్వారావుపేట:
పోలింగ్ స్టేషన్ నెంబర్: 266
మొత్తం ఓట్లు :620
పోలైన ఓట్లు  : 486
పోలింగ్ శాతం :75
పోలింగ్ స్టేషన్  నెంబర్ : 267
మొత్తం ఓట్లు : 643
పోలైన ఓట్లు  :477
పోలింగ్ శాతం 74.18
అన్నపురెడ్డిపల్లి
పోలింగ్ స్టేషన్  నెంబర్ : 268
పోలింగ్ ఓట్లు : 639
పోలైన ఓట్లు  : 448
పోలింగ్ శాతం 70.20
చంద్రుగొండ:
పోలింగ్ స్టేషన్ నెంబర్ : 269
మొత్తం ఓట్లు : 789
పోలైన ఓట్లు : 554
పోలింగ్ శాతం 70.21
Spread the love