నవతెలంగాణ – తుంగతుర్తి
ప్రముఖ సంఘ సంస్కర్త,అణగారిన జాతుల అభ్యున్నతికై అలుపెరుగని పోరాటం చేసిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆదివారం నియోజకవర్గ కేంద్రంలోని సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు గ్రంధాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. ఈ మేరకు విద్యాభివృద్ధి కోసం ఎన్నో పాఠశాలలను తెరిచి మహిళలకు చదువు నేర్పించిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, కులమత బేధాలు లేని సమాజాన్ని రూపొందించిన సావిత్రిబాయి పూలే, నేటితరం మహిళలకు ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్,మల్లెపాక వెంకన్న,వెంకటనారాయణ,శ్రీను, వెంకటేష్,ప్రసాద్,సైదులు,సమీర్ తదితరులు పాల్గొన్నారు.