నవతెలంగాణ – కంఠేశ్వర్
కేంద్ర ప్రభుత్వం 2024 నవంబర్ 24న విడుదల చేసిన జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విదానం (ఎన్పీఎఫ్ఎం) ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూరు వ్యవసాయ మార్కెట్ ప్రారంభమైన రైతుల నిరసన యాత్ర ఆలూరు, నందిపేట, నవీపేట, జానకంపేట్ మీదుగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ శ్రద్దానంద్ గంజ్ లో ముగిసింది. ఈ సందర్భంగా శోభన్ మాట్లాడుతూ..ఈ ముసాయిదా వల్ల గతంలో రద్దయిన చట్టాలను మార్కెట్ విధానాల రూపంలో రైతులపై రుద్దే అవకాశం ఉంది. ఇది రైతుల కోసం కాకుండా, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన విధానం. దేశ రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవసాయ మార్కెటింగ్ విధానాల ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం ద్వారా కనీన మద్దతు ధరకు (ఎంఎస్పి) చట్టబద్ధ హామీ ఇవ్వడంలో న్పష్టత లేకపోవడం రైతుల భద్రతకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఎంఎస్పి రక్షణ లేకుండా రైతులు మార్కెట్లో ఉన్న అనిశ్చిత వరిస్థితులను అధిగమించడం చాలా కష్టం. ఇది చిన్న రైతులను ఇంకా అస్థిరతలోకి నెట్టివేస్తుంది. ఈ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను వక్కన పెట్టి, వ్యవసాయ మార్కెటింగ్ను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది రాష్ట్రాల హక్కులను హరించే చర్య. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్లో అధిక ప్రాధాన్యత పొందే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయం పై వట్టుకోల్పోయి, కార్పొరేట్ సంస్థల అధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్ పిఓ) ప్రధాన భాగస్వాములుగా చూపబడుతున్నప్పటికీ, కార్పొరేట్ సంస్థల కేంద్రీకృత నియంత్రణకు దోహదవడుతుంది. గిడ్డంగుల ప్రైవేటీజరణ ద్వారా, రైతులు తమ ఉత్పత్తులను సకాలంలో నిల్వ చేసుకునే అవకాశాలను కోల్పోతారు. ధరల అస్థిరతలో రైతులకు భద్రత ఇవ్వాల్సిన పద్దతులు వూర్తిగా ప్రైవేట్ కంపెనీల నియంత్రణలోకి
వెళ్లడం వల్ల, రైతులు తమ ఉత్పత్తులకు నరైన ధరలు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. మార్కెట్ నియంత్రణలను తొలగించడం ద్వారా, పెద్ద సంస్థలు మార్కెట్ ను పూర్తిగా అధీనంలోకి తీసుకోవడమే కాకుండా, రైతులపై ఆర్థిక ఒత్తిడి పెంచే పరిస్థితిని సృష్టిస్తోంది. వ్యాపారులు రైతుల ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేయడం, తద్వారా అధిక లాభాలను పొందే అవకాశం ఉంది. చిన్న రైతులు వ్యవసాయం నుంచి వైదొలగాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. పంటలకు సరైన ధర పొందడంలో ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్కెటింగ్ వ్యవస్థలో కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం మరింత పెరగడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అసమానతలు పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న వ్యవసాయ మార్కెట్ వ్యవస్థకి సంబంధించిన అంశాలపైన కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఇలాంటి విధానాలు తీసుకురావటం రాజ్యాంగ న్ఫూర్తికి విరుద్ధం. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ.. దేశ రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవసాయ మార్కెటింగ్ విధానాల ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. దీని స్థానంలో రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే ఒక నమగ్రమైన మార్కెటింగ్ విధానాన్ని రైతు సంఘాలు, నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి తీసుకురావాలి. కనీన మద్దతు ధరకు చట్టబద్దతని కల్పించటం, మద్దతు ధర లెక్కింపులో డా. ఎంఎన్ స్వామినాథన్ సిఫార్సు చేసినట్టుగా సి2 పైన 50శాతం కలిపి మద్దతు ధరను ప్రకటించడం, ప్రస్తుతం ఉన్న ఎపిఎంసీలలో ఆధునిక నదుపాయాలు కల్పించి బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ యాత్రకు సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి సిర్పా లింగం మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న, ఎర్ర సాయిలు, ఇడగొట్టి సాయిలు, గంగారాం, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.