Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్త గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలి

దేశవ్యాప్త గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలి

- Advertisement -

– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
: వి‌బి‌జి‌ఆర్‌ఎస్‌ఏ‌ఎం‌జి పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రేపు నిర్వహిస్తున్న దేశవ్యాప్త గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్ పిలుపునిచ్చారు. గురువారం ఉపాధి కూలీలతో సమావేశమై అయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకొస్తోందని ఆరోపించారు. గ్రామీణ పేదల జీవనోపాధిని కాపాడేందుకు ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా రోజుకూలిని రూ.800లకు పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.ఈ కార్యక్రమంలో కూలీలు గంధ మల్ల ఆదాం కవిత,తాండ్ర సుధాకర్ తాండ్ర మమత బాకీ మన్మాత గంధమల్ల మహేశ్వరి,గంధమల్ల లక్ష్మి,మౌనిక,కాండ్ర పద్మ, లావణ్య,చొప్పరి స్వప్న,ఆలకుంట నరసింహ,ఎల్లమ్మ పుష్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -