ఈనెల 31న జేఏసీ నూతన వేదిక ఆవిర్భావం

JAC's new platform to be launched on the 31st of this monthనవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ లో సామాజిక న్యాయం కోసం ఈ నెల 31న హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ,ఎస్సి,ఎస్టీ రైట్స్ & రాజ్యాధికార సాధన జేఏసీ నుతన వేదిక ఆవిర్భావం ఉంటుందని జిల్లా బీసీ నాయకులతో కలిసి నగరంలోని జిల్లా బీసీ నాయకులు ధర్మాసమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు జిల్లా అధ్యక్షులు మహిపాల్ మాట్లాడుతూ.. ఈ తెలంగాణ లో సమస్త సబ్బండ వర్గాలైన 90% బీసీ,ఎస్సి,ఎస్టీ బలగాన్ని ఫూలే, అంబేద్కర్, కాన్షీరాం దారిలో బలంగా నడిపించాలి. అందుకోసం ఒక ప్రక్క బీసీ,ఎస్సి,ఎస్టీ లకు దక్కాల్సిన రావలసిన సమస్త రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం చేస్తూనే మరో ప్రక్క రాజ్యాధికారం కోసం యుద్ధం ప్రారంభించాలి. ఇదే మనం చేయాల్సిన ధర్మం. తెలంగాణ లో పార్టీలకు అతీతంగా కుల సంఘాలు,ప్రజా సంఘాలు అందరూ ఒక భావజాలం కింద కలిపి బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్య కార్యాచరణ వేదిక రూపొందించలని ఈ బీసీ,ఎస్సి,ఎస్టీ రైట్స్ రాజ్యాధికారన్ని సాధిద్దాం మన ప్రజలను విముక్తి చేద్దాం తెలంగాణలో మన రాజ్యాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం నాయకులు సాగర్ చారి,మేధారి భూమేష్,జిల్లా డి.ఎస్.పి నాయకులు రమేష్, కిషన్, మహిపాల్, పోచయ్య పాల్గొన్నారు.

Spread the love