వ్యక్తి అదృశ్యం 

Disappearance of personనవతెలంగాణ – కామారెడ్డి 

బీబీపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన జనగామ సాయిలు అనే వ్యక్తి కనిపించడం లేదని ఆయన భార్య మంజుల ఈనెల 5న బిబిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. జనగామ గ్రామానికి చెందిన జనగామ సాయిలు అనే వ్యక్తి మేస్త్రి పనిచేసేవాడని, ఈ నెల మూడున సుమారు మధ్యాహ్నం ఒంటిగంటకు ఇతరులతో ఫోన్ మాట్లాడుతున్నాడని, అతని భార్య మంజులకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంట్లో నిందిస్తుందని సుమారు రెండు గంటల ప్రాంతంలో తన తన ఇంటి దర్వాజాలు పెట్టి ఎటు వెళ్లిపోయినాడు అని, అనంతరం తాము వెతకగా అదే గ్రామానికి చెందిన దండగలరాములకు కామారెడ్డిలో కనిపించాడని తెలిపినట్లు ఆమె తెలిపారని, అనంతరం వారి బంధువుల ఇండ్లలో, గ్రామాలలో ఆచూకీ కోసం చూడగా ఎక్కడ ఆచూకీ లభించలేదని దాంతో ఈనెల 5న బీబీపేట పోలీస్ స్టేషన్లో ఆయన భార్య మంజుల ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నానీ, ప్రతి పోలీస్ స్టేషన్కు అతని ఫోటోను పంపించినట్లు ఎస్సై తెలిపారు.
Spread the love