దళిత మహిళపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని మాతూ సంఘం గ్రామంలో సర్వేనెంబర్ 119లో సంగవ్వ అనే దళిత మహిళ ప్రభుత్వ భూములు విత్తనాలు వేయిచుండగా రాజేందర్ రావు అక్కడికి చేరుకొని, ఈ భూమి నాదని నీకు ఎటువంటి హక్కు లేదని దళిత మహిళ సంగవ్వను గుంజి కొట్టడంతో పాటు అనేక బూతు పదాలు వాడి మాల మాదిగ దాన నీకెక్కడి నుంచి ఇక్కడ భూమి వచ్చిందని, అడ్డమైన పదా జలాలతో దూషిస్తూ కొట్టడం జరిగింది. దానిపై ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది. అలాగే నాకు న్యాయం జరగాలని గాంధారి తహసిల్దార్ కి నాకున్యాయం చేయాలని మోరా పెట్టుకోవడం జరిగింది. మోతి రామ్ నాయక్ మాట్లాడుతూ దళిత మహిళకు న్యాయం జరగకపోతే ఎక్కడి కైనా వెళ్ళినా ఆయనకు అరెస్ట్ చేసిన తర్వాత ఊరుకునేది లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధు, రాములు, స్వప్న ,సాయిలు, ఏమి సింగ్   తదితరులు పాల్గొన్నారు.
Spread the love