కడుపునిండా భోజనం చేస్తున్న నిరుపేదలు ..

The poor eating to their full stomachs..– ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. 
నవతెలంగాణ – భువనగిరి
పేద, దళిత అనే తేడా లేకుండా ఉండాలనే కడుపునిండా భోజనం చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్నీ తీసుకొచ్చిందని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణం లోని తారక రామ్ నగర్ లో భువనగిరి ఎమ్మెల్యే  కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తి,జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి  పుష్పలత నివాసం లో సన్న బియ్యం భోజనం చేశారు .ఈ సందర్భంగా భువనగిరి శాసన సభ్యులు మాట్లాడుతూ పేద వారు సంతోషంగా కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో   రాష్ట్ర  ముఖ్యమంత్రి   ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం దేశంలోని ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో మొదటి సారిగా ప్రారంభించారన్నారు. పేద , ధనిక అనే బేధాలు లేకుండా అందరికీ ఒకే రకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు.  ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఒక్కో మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ఆర్థికంగా ముందుకు  వెళ్లాలనదే ప్రభుత్వం  యొక్క ఉద్దేశం అని అన్నారు.  జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ పేద కుటుంబం అయిన   పుష్పలత ఇంట్లో భువనగిరి శాసన సభ్యులతో కలిసి  భోజనం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 515 రేషన్ దుకాణాల్లో 2 లక్షల 17 వేల  మంది రేషన్ కార్డు లబ్ధి దారులకు ఈ సన్న బియ్యాన్ని  అందించడం జరుగుతుందన్నారు. సన్న బియ్యం వచ్చాక ప్రతి పేద కుటుంబం సంతృప్తిగా కడుపు నిండా తింటున్నామని పుష్పాలత సంతోషం వ్యక్తం  చేశారన్నారు. ఇంట్లో రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి సన్న బియ్యాన్ని అందించాలన్న చారిత్రాత్మక పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. సన్న బియ్యంతో పాటు ప్రభుత్వం అందిస్తోన్న అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని, అభివృద్ధి సాధించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో  జడ్పీ సీఈఓ శోభారాణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు,  సివిల్ సప్లై మేనేజర్ శ్రీనివాస్, సివిల్ సప్లై అధికారి వనజాత,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Spread the love