అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి– ధర్నాను జయప్రదం చేయండి
– సీఐటీయూ ఆధ్వర్యంలో సీడీపీఓ
– కార్యాలయంలో వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-తాండూర్‌ రూరల్‌
అంగన్‌వాడీ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ధర్నాను జయప్రదం చేయాలంటూ మంగళవారం అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్‌ యూనియన్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై 10న అంగన్‌వాడీ డిమాండ్స్‌ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టు కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ఆ ధర్నాకు కార్మికులందరూ హాజరై సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలన్నారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. ఏండ్ల తరబడి సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అంగన్‌వాడీలు కొనసాగుతున్నాయని తెలిపారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించి, రిటర్మెంట్‌ బెనిఫిట్స్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్‌ నాయకులను ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. హామీల అమలు కోసం ప్రతి ఒక్కరూ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు బేబీ, అనూష, అంగన్‌వాడీ కార్యకర్తలు హెల్పర్లు పాల్గొన్నారు.

Spread the love