నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్రాంత ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావిళ్ళ సీతారామయ్య ప్రభుత్వాన్ని కోరారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు తమ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ద్రృష్టి కి తీసుకొని వెళ్లాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘ కాలం అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ లకు నగదు రహిత ఉచిత వైద్యం అందజేయాలి. (ఇ.హెచ్.యస్) పెండింగ్ లో ఉన్న నాలుగు డి ఏ ల ను వెంటనే పరిష్కరించాలన్నారు. క్వాంటం పీరియడ్ ను 15 సం.నుండి 12 సం.లుగా పరిగణించాలని అన్నారు. అలాగే పి.ఆర్.సి. అమలు అమలుచేసి విశ్రాంతి ఉద్యోగులను కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా శాఖ అధ్యక్షుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, కోశాధికారి హమీద్ ఖాన్, జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులు , మండల శాఖల అధ్యక్ష, కార్యదర్శులు, సీనియర్ ప్రాధమిక సభ్యులు పాల్గొన్నారు.