ఉద్యమాకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..

The promises made to the activists should be fulfilled.– కళాకారులు అందరికీ గుర్తింపు కార్డులు, రూ.20వేల రూపాయల గౌరవ వేతనము  అందజేయాలి..
– రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు..
నవతెలంగాణ – వేములవాడ 
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..కళాకారులు అందరికీ గుర్తింపు కార్డులు, 20ేల రూపాయల గౌరవ వేతనము  అందజేయాలని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని తిప్పాపురం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫారం, చైతన్య యాత్ర ఉద్యమ నాయకులకు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావును, ఇతర ముఖ్య నాయకులను వేములవాడ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎల్లపోశెట్టి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ాక్టర్ చీమ శ్రీనివాసరావు మాట్లాడుతూ..  సెప్టెంబర్ 27 తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆరవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆత్మీయ ఘన సన్మాన కార్యక్రమం, వాల్ పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగిందని అన్నారు.  ఉద్యమకారుల కళాకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ 250 గజాల స్థలం, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమకారులను గుర్తించటానికి ఒక కమిటీ వేయాలని ఉద్యమకాుల కళాకారులు అందరికీ గుర్తింపు కార్డులను అందజేయాలి, అలాగే ఉద్యమకారులకు కళాకారులకు నెలనెలకు 20000 రూపాయల గౌరవ వేతనము అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సురేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి, వెంగల భాస్కర్,కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎల్ల పోశెట్టి ఉద్యమ నాయకులు నేరెళ్ల తిరుమల గౌడ్, బొజ్జ కనకయ్య, కళాకారుల జిల్లా క్వీనర్ వారాల దేవయ్య,  అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు150 మంది కళాకారులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love