Sunday, June 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనానక్‌రామ్‌‌గూడ రోడ్డుకు ట్రంప్‌ పేరును విరమించుకోవాలి

నానక్‌రామ్‌‌గూడ రోడ్డుకు ట్రంప్‌ పేరును విరమించుకోవాలి

- Advertisement -


​సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు 
తుమ్మల వీరారెడ్డి
నల్లగొండలో నిరసన కార్యక్రమం
​నవతెలంగాణ – నల్లగొండ టౌన్

​​హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌‌గూడ రోడ్డుకు డోనాల్డ్ ట్రంప్ పేరు పెట్టే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ​సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ ప్రాంతంలోని అమెరికన్ కాన్సులేట్ ప్రాంతంలో ఉన్న రోడ్డుకు అమెరికా అధ్యక్షులు ట్రంప్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి వైఖరి పట్ల అభ్యంతరం, నిరసన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజా కవులు, ఉద్యమకారుల స్మారకార్థం పెట్టుకోవాల్సిన రోడ్ల పేర్లను యుద్ధోన్మాది, దుర్మార్గుడైన డోనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హశం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి సలీం, జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, సాగర్ల మల్లయ్య, నర్సిరెడ్డి, జేరిపోతుల యాదయ్య, తాలూకా వెంకన్న, సుంకరబోయిన రవి, ఉంగరాల సైదులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -