– మున్సిపల్ కమిషనర్ రాజు
నవతెలంగాణ- ఆర్మూర్
ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కుల గణన సర్వేలో పాల్గొనని వారు పట్టణంలో 73 మందిని గుర్తించామని మున్సిపల్ కమిషనర్ రాజు ఆదివారం తెలిపారు. ఈనెల 16 నుండి 28వ తేదీ వరకు సర్వేలో పాల్గొనని వారు వివరాలు అందజేయవచ్చన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజాపాలన సేవ కేంద్రం ఏర్పాటు చేసామన్నారు. సెలవు రోజుల్లో కూడా ప్రజాపాలన సేవ కేంద్రం పనిచేస్తుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.