Tuesday, June 2, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రశ్నే గుండె శబ్దం

ప్రశ్నే గుండె శబ్దం

- Advertisement -


ఏనాడు దేశానికి
ద్విజాతి సిద్ధాంతం
విషం చిమ్మాడో
అదే వాని దైవాస్థిత్వం
ఇక శాఖోపశాఖలుగా
పొంగిపొరలే
భజనమురికి
సిగ్గూ ఎగ్గూ లేక
బ్రిటీష్ దొరల
బూట్లు నాకిన
‘దేశభక్తుడు` కదా
భారతరత్న ఇవ్వాల్సిందే..
వందేళ్ళ సామ్రాజ్యం
ఎందుకు? బొందపెట్టనా..?
మనుషులంతా ఒక్కటే
అనడం ఎంత బూటకం?
చర్రిత ఎప్పుడూ పాలకులదే
బానిసలది కానేకాదు
ప్రజాస్వామ్యం
ఓ తేనెపూసిన కత్తి
జాతీయవాదం
గోమాత ముసుగు!
ఆ చాకచక్యానికి
చాణిక్య నీతే
సలాం!
పాపం పిచ్చివాళ్ళు
భయపడటం
అలవాటైపోయింది
బతకడం
చావడం
ఒక్కటయ్యాక
ప్రతి గుండెశబ్దం
మౌనంగా సంధించే
సిసలైన ప్రశ్న
కె .శాంతారావు
9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -