డబ్బు బ్యాగును పట్టుకొని తిరిగి అప్పగించిన రైల్వే పోలీసులు

The railway police who held the money bag and handed it backనవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రయాణికుడు డబ్బుతో ఉన్న బ్యాగును రైల్వే పోలీసులు పట్టుకుని తిరిగి అందజేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికుడు శ్రీధర్రెడ్డి బుధవారం కడప నుంచి రాయలసీమ ఎక్స్ ప్రెస్లో హైదరాబాద్ బయలుదేరాడు. ఆయన గురువారం ఉదయం ఏడు గంటలకు బేగంపేట్ రైల్వే స్టేషన్లో దిగారు. అయితే రూ.2.20 లక్షలతో ఉన్న బ్యాగును ట్రైన్లో మర్చిపోయాడు. రైలు దిగాక ఈ విషయాన్ని గమనించిన ఆయన రైల్వే పోలీసులను సంప్రదించాడు. దీంతో నిజామాబాద్ లో రైల్వే పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకొని తిరిగి అతడికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love