ఆకాల వర్షం.. అపార నష్టం

Untimely rain.. immense damage– నేలరాలిన వరిధాన్యం..నేలకొరిగిన మొక్కజొన్న 
నవతెలంగాణ – బెజ్జంకి  
ఆకాలంగా కురిసిన వర్షం వల్ల మండలంలో ఆరుగాలం కష్టపడిన అన్నధాతలు ఆగమాగమయ్యారు. శుక్రవారం కురిసిన అకాల వర్షం గాలి భీభత్సం సృష్టించింది. వడగండ్లు కురియడంతో కోతకు వచ్చిన వరి పైరుల్లో వరిధాన్యం నేలరాలాయి. మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి.దీంతో రైతులు అందోళన చెందారు. ఆకాల వర్షం వల్ల నేలరాలిన వరి,నేలకొరిగిన మొక్కజొన్న పంటలను వ్యవసాయ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి ప్రభుత్వం పరిహారం అందించేల కృషి చేయాలని అయా గ్రామాల రైతులు విజ్ఞప్తి చేశారు.
33.3 శాతం నష్టంవాటిల్లితే పరిగణనలోకి..
ఆకాలంగా కురిసిన వర్షాల వల్ల నేలరాలిన వరిధాన్యం, నేలకొరిగిన మొక్కజొన్న సుమారు 33.3 శాతం నష్టం వాటిల్లితే పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని శనివారం ఏఈఓలు తెలిపారు. ఏఓ అధేశానుసారం అయా క్లస్టర్ గ్రామాల్లో ఏఈఓలు వరిధాన్యం, మొక్కజొన్న పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించనున్నట్టు ఏఈఓలు తెలిపారు.
Spread the love