
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో ఆందోల్ మైసమ్మ మినీ గూడ్స్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం జొన్నకంటి దేవయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐఆర్టిడబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి పాషా మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ చట్టం 2019ని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని పాషా డిమాండ్ చేశారు. ట్రాన్స్పోర్ట్ కార్మిక వర్గానికి భవన నిర్మాణ కార్మికుల వలే వెల్ఫేర్ బోర్డు ద్వారా ట్రాన్స్పోర్ట్ కార్మిక వర్గానికి సేవలందించాలని సూచించారు.ట్రాన్స్పోర్ట్ కార్మికులు మార్చి 23న తమ సమస్యలపై పార్లమెంటు ముందు జరిగే ధర్నాను కార్మికులు కలిసికట్టుగా కదిలి తమ సమస్యలను తదితర డిమాండ్లను సాధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దండు మల్కాపురంలోని ఇండస్ట్రియల్ పార్క్ లో దండు మల్కాపురం గ్రామ రైతులు భూములు కోల్పోయి జీవన భృతి సాధించాలని ఎండి పాషా సూచించారు. మినీ గూడ్స్ వెహికల్ లతో జీవన భృతి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పులతో బండ్లు కొనుక్కొని నడుపుతున్నారని అన్నారు.ఇండస్ట్రియల్ పార్కులో ఎగుమతులు దిగమతులు తదితర లోడ్లు దండు మల్కాపురం గ్రామ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్ ప్రధాన కార్యదర్శి బద్దుల లింగస్వామి గుర్రం గురవయ్య జొన్న కంటి సురేందర్ చిట్టెంపల్లి నరేందర్ దేవరయ్య సుధాకర్ అన్నము గల మహేష్ జొన్నకంటి నరేంద్ర గిరికట్టి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.