నవతెలంగాణ – గీసుగొండ : ఇంటి బాధ్యతలతో పాటు, ఉద్యోగరీత ఒత్తిడిని తట్టుకుంటూ మండలాభివృద్ధిలో మహిళల ఉద్యోగుల పాత్ర అభినందనీయం అని తహసిల్దార్ రియాజుద్దీన్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా గీసుకొండ మండలంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న మహిళ ఉద్యోగులను మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్ శాలువాలుగప్పిపుష్ప గుచ్చాలు ఇచ్చి సన్మానించారు. సందర్భంగా తాసిల్దార్ రియాజుద్దీన్ మాట్లాడుతూ…మహిళల సహకారంతోనే నియోజకవర్గంలోనే మన మండలం అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయడంలో ముందు నిలిచామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణవేణి, ఎంపీ ఓ ఆడెపు ప్రభాకర్, సూపర్డెంట్ కమలాకర్ కార్యదర్శులు సునీత, లావణ్య,శారద,సరిత తదితరులు పాల్గొన్నారు.