గ్రామాల ఆభివృద్దిలో సర్పంచ్ పాత్ర కీలకం

నవతెలంగాణ – జుక్కల్
గ్రామాల ఆభివృద్దిలో సర్పంచ్ ల పాత్ర కీలకంగా ఉంటుందని గ్రామస్తుడు రాజశేఖర్ పటేల్ అన్నారు. శనివారం నాడు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో  యువ నాయకుడు రాజశేఖర్ పటేల్ మాట్లాడుతు సర్పంచ్ అశ్వీని పటేల్ , ఉప సర్పంచ్ , వార్డు సబ్యులకు గ్రామస్తులు శాలువా తో సన్మానించి ఙ్ఞాపికలను అందించారు. గ్రామస్తులు మాట్లాడుతు గత ఐదేండ్లుగా గ్రామములో  కోట్లాది రూపాయలతో సీసీ రోడ్లు, డ్రేయిన్స్ , విధీలైట్లు, , హరితహరం, జీపీ భవనం, పాఠశాల భవనం , అంగన్ వాడి భవనం, ఇవే కాకుండా సంక్షేమ పథకాలైన అసర పెన్షన్, కళ్యాణ లక్ష్మీ, రైతుభందు, రైతుభీమా, అమ్మవోడి, ఫథకాలను నిరంతరంగా అందించడంలో ప్రభూత్వానికి వెన్ను దన్నుగా ఉండి గ్రామాభివృద్దిలో  కృషి చేసారని, ఇవన్ని గ్రానస్తుల సహకాహరంతో చేపట్టామని, ఉప సర్పంచ్, వార్డు సబ్యులు అభివృద్దిలో పూర్తీగా సహకరించారని ,జీపీ సెక్రట్రి మంచి మద్దతు ఇచ్చారని పేర్కోన్నారు. సర్పంచ్ అశ్వీన్ పటేల్  మాట్లాడుతు తనకు సహకరించిన గ్రామస్తులు, జీపీ కార్యవర్గసబ్యులకు,  జీపీ సెక్రట్రికి కృతఙ్ఞతలు  తెలిపారు.  కార్యక్రమంలో సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సబ్యులు, ఎంపిటిసి విజయ, గ్రామస్తులు హన్మండ్లు, శీవాజీ , సాయులు తదితరులు పాల్గోన్నారు.

Spread the love