తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంలో భారత కమ్యూనిస్టు పార్టీ పాత్ర కీలకం..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భారత కమ్యూనిస్టు పార్టీ పాత్ర కీలకమని తమ జాతీయ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తీర్మానం చేసిన తర్వాతనే బీజేపీ మిగతా పార్టీలు తీర్మానం చేశాయనీ సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం స్థానిక ధర్మ భిక్షం భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పనిచేసిన సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిజాం కు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించి భూమి భుక్తి విముక్తి కొరకు తిరుగులేని పోరాటం నిర్వహించి 4500 మంది అమరులై 4లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేసిన ఘనత సిపిఐ ది అన్నారు. 1969లో, 1980లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు వీరోచిత పోరాటం నిర్వహించారని అన్నారు. 2009లో వరంగల్ డిక్లరేషన్ ఇచ్చి ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు సిపిఐ పదివేల కోట్లు తెలంగాణకు కేటాయించాలని కోరిందన్నారు. ఎంతోమంది యువకులు అమరత్వం పొందగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిగివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది అన్నారు. తెలంగాణ జేఏసీ ఉద్యమంలో ఉద్యోగులు యువకులు ఆర్టీసీ కార్మికులు కర్షకులు పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉండి నీళ్లు, నిధులు, నియామకాల అంటే లక్ష్యాలను నెరవేర్చకుండా ఏడు లక్షల కోట్ల అప్పులను ప్రజల నెత్తిన పెట్టిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నిధులు ఉద్యోగాల అభివృద్ధి పేరుతో వచ్చిన కాంగ్రెస్కు తామంతా సహకరించామని కాంగ్రెస్ ప్రభుత్వం అందరిని కలుపుకుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు అనంతుల మల్లేశ్వరి,పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏ ఐ టి యు సి  గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు,గోపగాని రవి, నిమ్మల ప్రభాకర్,ఎండి పాషా, దంతాల పద్మ రేఖ, పెండ్రకృష్ణ, దీకొండ శ్రీనివాస్, పున్నం రమేష్ ,మల్లికార్జున్, బూర సైదులు, తాళ్ల సైదులు, వాడపల్లి వెంకన్న, వాడపల్లి గోపి,కిట్టు,నవీన్,రెడీమల శీను,తదితరులు పాల్గొన్నారు.
Spread the love