అమరుల త్యాగం.. ఎన్నటికీ మరువం: కలెక్టర్

– అమరులకు ఘనంగా నివాళులు
– అభివృద్దే మా లక్ష్యం
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ  రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు.రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) ఆవరణలో ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు తెలుపుతూ, ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరిస్తూ స్థూపం వద్ద ఘనంగా కలేక్టర్,ఎస్పి,అదనపు కలెక్టర్లు నివాళులర్పించారు. తెలంగాణ జాతీయ పతాకావిష్కరణ గావించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 వసంతాలు పూర్తి  చేసుకొని 11 వ వసంతంలోకి అడుగిడుతూ  ఉత్సాహ పూరిత వాతావరణంలో  వేడుకలు  జరుపుకోవడం  ఎంతో ఆనందంగా ఉందన్నారు.  ఈ సందర్భంగా వారి ఆశయాలు, ఆకాంక్షల మేరకు జిల్లాను అభివృద్ధి పధంలో పయనించుటలో  ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహిళా సంక్షేమానికి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పరుచుటకు పెద్ద పీట వేశామని అలాగే ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలన చేసి సత్వర పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మహిళ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 86,498 మంది విద్యార్థులకు ఏక రూప దుస్తులు అందిస్తున్నాని అదేవిదంగా పాఠశాలలు పున ప్రారంభం ముందే నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.  రైతులు దేశానికే ఆదర్శంగా నిల్వలనే లక్ష్యం తో రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కై కృషి చేస్తున్నట్లు తెలిపారు.తదుపరి జెడ్పి హెచ్ ఎస్  సిరిపురం, బాలభవన్,   శ్రీ చైతన్య స్కూల్, పాఠశాలల విద్యార్థులు చేసిన గీతాలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించి అభినందించారు. కార్యక్రమంలో  విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు అందించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే,ట్రైనీ ఎఎస్పీ రాజీవ్ మీనా, అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, బి.ఎస్. లత, సి.ఈ. ఓ అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు,  డి.ఎఫ్.ఓ సతీష్ కుమార్, ఆర్.డి.ఓ వేణు మాధవ్, జిల్లా అధికారులు , ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love