అమరవీరుల త్యాగాలు మరువలేవి: సమ్మయ్య 

నవతెలంగాణ – పెద్దవంగర
స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుంపల సమ్మయ్య అన్నారు. శనివారం ఉప్పెరగూడెం గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు కొవ్వొత్తుల తో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రావాలని, మా పాలన మాకొస్తే బాగు చేసుకుంటామనే ఆకాంక్షతో ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, అమరుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు నీలం సోమయ్య, మాజీ సర్పంచ్ వేముల రఘు, మాజీ ఉపసర్పంచ్ మేకల శ్రీనివాస్, ఎండీ షర్ఫీద్దీన్, దుంపల వేణు, పాశం రమేష్, తిమ్మిడి వెంకన్న, దుంపల రాజు, ముసుకు మహేందర్, సోమ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love