అంగన్వాడీ టీచర్ల సేవ గొప్పది..

– అంగన్వాడిలో చదివిన పిల్లలు వివిధ స్థాయిలో ఉండేలా మనం తయారు చేయాలి..
– జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
అంగన్వాడి సెంటర్లలో టీచర్ల ద్వారా పిల్లలకు ప్రాథమిక విద్య అందించడం వారు చేస్తున్న సేవలను కలెక్టర్ కొనియాడారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో  సూర్యాపేట జిల్లాలోని 70 మంది అంగన్వాడీ టీచర్లకు నూతన పూర్వ ప్రాథమిక విద్య పై జరుగుతున్న శిక్షణ తరగతులలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ.. అంగన్వాడి సెంటర్లలో టీచర్ల సేవ మరువలేనిదని, అంగన్వాడీలో  పిల్లలకు పౌష్టిక ఆహారంతో పాటు చదువు పట్ల మక్కువ పెరిగేలా చేసి వారు ఉన్నత స్థాయికి చేరేలా నూతన పూర్వ ప్రాథమిక విద్య ను అందించి వారిలో మానసిక, శారీరిక భాష, సాంఘిక భావోద్వేగా భావాలను అభివృద్ధి పరిచె విధంగా వారి పాఠ్యప్రణాళికను రూపొందించుకొని ఫ్రీ స్కూల్ తరగతులు నిర్వహించాల్సిందిగా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన టీచర్లు మండల స్థాయి మిగతా అంగన్వాడి సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించి, పిల్లలకు నూతన పూర్వ ప్రాధమిక విద్య అందించేలా చర్యలు పేర్కొన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి, పద్మ, సీడీపీఓలు సూపర్ వైజర్లు పాల్గొన్నారు.
Spread the love