రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులను పూర్తిగా విస్మరించింది: అన్నదాతలు

నవతెలంగాణ – మిరుదొడ్డి 
రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులను పూర్తిగా విస్మరించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పాల బిల్లులు చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పాడి రైతులు వాపోతున్నారు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో పాడి రైతులు విజయ పాల డైరీ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గతంలో 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు పాల డబ్బులు వచ్చేవని తెలిపారు. ఇప్పుడు రెండు నెలలు గడిచిన బిల్లులు రాకపోవడంతో పశుపోషణ చేయలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. బిల్లుల జాప్యం పై అధికారులను ప్రశ్నించిన పొంతన లేని సమాధానం చెబుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న పాడి రైతుల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.
Spread the love