Monday, August 31, 2026
E-PAPER
Homeజాతీయం'142'తో ఆ కేసులను సుప్రీం కోర్టు రద్దు చేయొచ్చు: కేంద్రం

‘142’తో ఆ కేసులను సుప్రీం కోర్టు రద్దు చేయొచ్చు: కేంద్రం

- Advertisement -
  • నవతెలంగాణ-హైదరాబాద్: గత నెల జూలై 20న నీట్ పేపర్ లీక్ ను వ్యతిరేకిస్తూ సీజేపీ పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షా విధానంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆ సమయంలో యువతపై భద్రతా బలగాలు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేశాయి. అంతేకాకుండా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారు. దీంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయబడ్డారు. నిరసనలో పాల్గొన్న అనేక మంది యువతపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల దమనకాండాపై పార్లమెంట్ లో విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కూడా చేశారు. తాజాగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో పిల్ దాఖలు చేసింది. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని పిటిషన్ వేసింది. ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ ‘142` కింద సుప్రీంకోర్టుకు ఉన్న అసాధారణ అధికారాలను ఉపయోగించుకోవాలని కేంద్రం కోరుతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను రేపు (మంగళవారం)విచారించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -