నవతెలంగాణ-మద్నూర్
జిల్లా, మండల కేంద్రాలలోని ప్రభుత్వ కార్యాలయాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల గురించి వివరంగా సదరు బోర్డుపై తెలుగులో పొందుపరచాలనీ సోమవారం ప్రజావాణిలో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా బీజేపీ మండలాధ్యక్షులు తుకారం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల గురించి ప్రభుత్వ కార్యాలయాలలోని నోటీసు బోర్డులలో ఏర్పాటు చేస్తే అర్హులైన లబ్దిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలకు ఒ స్పష్టత రావడమే కాకుండా.. దళారుల బారిన పడకుండా నేరుగా ప్రజలు ఉపయోగించుకునే వీలు కల్పించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాటు సీనియర్ నాయకులు బి.హనుమానులు, మండల ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ఐద్వాజ్, శివ జ్ఞానేశ్వర్, రాజు విట్టల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్షేమ పథకాల బోర్డులు ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



