జూలై 24 తో ముగుస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం..

నవతెలంగాణ – మోపాల్
జెడ్పీటీసీ, ఎంపీపీల పదవీకాలం జూలై 4వ తేదీన ముగుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసినట్టు జెడ్పీ ఎన్నికలను కూడా వాయిదా వేస్తారా లేకపోతే ఎన్నికలకు వెళ్తారా అని వేచి చూడాల్సిందే. గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ పంచాయతీరాజ్ చట్టాలను మాత్రం నిర్వీర్యం చేస్తుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పది సంవత్సరాలు అయినా తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది చాలామంది కార్యకర్తలు అప్పటి ప్రతిపక్షంలో సాధకబాదకలను అనుభవించారు రోజురోజుకీ రాజకీయ నిరుద్యోగిత పెరిగిపోతుండడంతో ఆ పార్టీలోనే ఆశావాహులు రోజులను లెక్కించుకుంటున్నారు ఎప్పుడు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందో అని.. కానీ మండల స్థాయిలో చక్రం తిప్పాలన్న మండలాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్నా కేవలం ఎంపీపీ జడ్పిటిసి పదవులతోనే సాధ్యమవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఎంపీపీ మరియు జడ్పిటిసి లకు అరకొర నిధులు మంజూరు చేసి ఆ వ్యవస్థను మాత్రం చాలా నిర్వీర్యం చేసింది.

ముఖ్యంగా మోపాల్ మండలం కొత్త మండలంగా ఏర్పడి దాదాపు కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా మండల పరిషత్ ఆఫీసుకి సొంత భవనం లేదు మండల కేంద్రంలో ఒక చిన్న భవనాన్ని అద్దెకి తీసుకొని అందులో స్థలం సరిపోక  ఎంపీపీ తో పాటు మండల్ ఆఫీస్ సిబ్బంది కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలంటే మండల కేంద్రానికి ఆమడ దూరంలో ఉన్న రైతు వేదికకు వెళ్లాల్సి వస్తుంది. ఒకానొక సమయంలో ఆఫీస్ మెయింటెనెన్స్ కి డబ్బులు లేక అద్దెకి తీసుకున్న భవనానికి అద్దె కట్టక ఆ భవన యజమాని తాళం వేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా మోపాల్ మండల పరిషత్ ఒకటే కాదు రాష్ట్రంలో చాలా మండల పరిషత్ ల పరిస్థితి ఇదే రకంగా ఉంది. పేరుకే పెద్ద పదవులు నిధులు మాత్రం శూన్యం కనీసం నిధులు లేక వారిని సర్పంచ్ ఎంపీటీసీలు కూడా పట్టించుకోవడం లేదు. ఈ రోజుల్లో ఒక పెద్ద మండలానికి జెడ్పిటిసి గా పోటీ చేసి గెలవాలంటే కోటి రూపాయలు పైబడి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చాలామంది రాజకీయ జీవితం ఎంపీపీ జడ్పిటిసి పదవుల నుండి ప్రారంభమైంది. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం జడ్పిటిసి స్థాయి నుండి ఈరోజు ముఖ్యమంత్రి వరకు అయ్యారు అంటే ఆయనకు రాజకీయ తొలి మెట్టు మాత్రం జడ్పిటిసి పదవి.. ఇప్పటికైనా ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడిన జడ్పిటిసి లకు సరైన స్థాయి మరియు సముచిత స్థానం ఉంటుందో లేదో మరి చూడాల్సి ఉంటుంది. కనీసం ఎంపీపీకి మండల్ ఆఫీస్ లో ఒక చాంబరు మండలాధికారులందరూ పరోక్షంగా తనకిందనే ఉంటారు. ఎంపీపీ పదవి కంటే జడ్పిటిసి స్థాయి పెద్దది కానీ మండల కేంద్రంలో ఎక్కడ కూడా ఆయనకు కుర్చీ కూడా ఉండదు ఒక ఛాంబర్ కూడా ఉండదు కేవలం జిల్లా పరిషత్ లో మాత్రమే గౌరవం ఉంటుంది. జెడ్పిటిసిలకు స్థాయి పెద్దది పరిధి చిన్నదిగా తయారైంది వారి పరిస్థితి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటినుండి మూడంచల వ్యవస్థను మరింత నిర్వీర్యం చేస్తుంది కేంద్రం నుండి వచ్చే నిధులను డైరెక్ట్ గా గ్రామపంచాయతీలకే అనుసంధానం చేయడంతో వీరు ఉత్సవ విగ్రహాలు లాగా మిగిలిపోతున్నారు. కానీ ఇలాంటి పెద్ద పదవులు పొందాలంటే మాత్రం ఒక రకంగా రిజర్వేషన్ అనుకూలించాలి.
మరో రకంగా ధనలక్ష్మి కనుకరించాలి.. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కు మాత్రమే క్యాబినెట్ ర్యాంకు తో పాటు మంచి గౌరవ వేతనంతో మంచి అలవెన్స్ లు పొందుతున్నాడు కానీ జెడ్పిటిసిలకు మాత్రం ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనమె సరిగా రావడం లేదు. మండలంలోని తన పరిధిలో నిధులు లేకుండా గ్రామాలకు ఎక్కడ కూడా తమ నిధులను మంజూరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. ఈక గ్రామాలలో ఎంపీటీసీలకు మాత్రం వార్డు మెంబర్ కు ఉన్న ప్రాధాన్యత కూడా లేదు నిధులు లేవు గౌరవం లేదు ఉన్నారా అంటే ఉన్నారు అన్నట్టు ఒక విగ్రహం లాగా ఉంది వారి పరిస్థితి.. గ్రామంలో ఒక బోరు వేయించడానికి కూడా వారి దగ్గర నిధులు లేక ప్రజల ముందు తలదించుకునే పరిస్థితికి దిగజారింది ఎంపీటీసీ వ్యవస్థ.. శిలాఫలకాల పేరుకు మాత్రమే ఈ పదవి ఉంది తప్ప ప్రజల సమస్యలను తీరుస్తామని నమ్మకం లేక లోలోపల కుమిలిపోతున్నారు. మళ్లీ ఎన్నికలు వస్తే తాము పోటీ చేయాలంటే సిగ్గుగా ఉందని ప్రజల ముందు ఈ ముఖం పెట్టుకొని వారికి ఓట్లు అడగాలని అంతర్మోదనంతో కుమిలిపతున్నారు . రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని సక్రమంగా గుర్తించక రోజుల్లో ఎంపీటీసీ పదవికి గౌరవం లేకుండా పోయింది. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వమైన వీరిని గుర్తిస్తుందో లేక పాత ప్రభుత్వంలో లాగే పక్కన పెడుతుందో వేచి చూడాలి మరి…. దేశం యొక్క దశ దిశ మారాలంటే ఈ మూడు అంచల వ్యవస్థ ప్రధాన కీలకం దేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలంటే ఈ వ్యవస్థలే అనుసంధాన కర్తగా వ్యవహరిస్తాయి.. అందుకే భారత రాజ్యాంగం కూడా ఇ వ్యవస్థల పైన ఎన్నో చట్టాలు మరియు శాసనాలను చేశాయి.
Spread the love