రెండు గ్లాసుల సిద్దాంతం విడనాడాలి..

నవతెలంగాణ – తంగళ్ళపల్లి
వెనుకటి నుండి వస్తున్న ఆచారం రెండు గ్లాసుల సిద్ధాంతాన్ని ప్రజల విడనాడాలని ఇన్చార్జి ఎంపీడీవో జోగం రాజు అన్నారు. తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో శనివారం సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటరాని తనం నిర్మూలనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. గ్రామాల్లో కులమతాలు విడనాడి అందరూ ఐక్యంగా ఉండాలని వారు కోరారు. గ్రామాల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే పద్ధతిని ఎవరు కొనసాగించవద్దని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ మధు, ఎంపిటిసి నలువాల లక్ష్మి, అంబేద్కర్ సంఘం నాయకులు, పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Spread the love