ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం ఉపాధ్యాయులకు తీరని అన్యాయం..

నవతెలంగాణ – వేములవాడ 
ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకొని  ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేశారని,ఉపాద్యాయ పదోన్నతుల్లో బిఈడి చేసి ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న  ఎస్ జి టి లకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ బుధవారం వేములవాడ మండల విద్యాధికారి భాన్నజీ కి ఉపాధ్యాయులు  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఇటీవల మారిన నిబంధనలకు మేరకు  బీఈడీ అర్హత కలిగిన ఉపాధ్యాయులను  పి ఎస్ హెచ్ ఎం లు గా ప్రమోషన్ కి అనర్హులుగా ప్రకటించి  ఎంతో మంది ఉపాధ్యాయులను ఆవేదనకు గురి చేశారని అన్నారు.  బీఈడీ ఉపాద్యాయులు వారి ఉద్యోగ జీవితాన్ని దారపోసి 20-30 సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాలల్లో బోధిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకొని ఆశావహులైన సీనియర్ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను బీఈడీ ఎస్ జి టి లకు సహజ న్యాయ సూత్రాలకు లోబడి పి ఎస్ హెచ్ ఎం  లుగా ప్రమోషన్ కల్పించాలి,పిఎస్ లలో పనిచేస్తున్న బీఈడీ ఎస్ జి టి  లను కాలయాపన లేకుండా ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి చక్రపాణి, టి కృష్ణ హరి, పి రవీందర్, పి రామ్ గోపాల్, జి నరేష్, జి రాజేశం, ఏ శ్రీనివాస్, మహేష్, శ్రీనివాస్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love