ఘనంగా తొలి ఏకాదశి పండగ

The very first Ekadashi festivalనవతెలంగాణ – గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా తొలి ఏకాదశి పండుగను బుధవారం మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రైతులు మహిళ లు అధిక సంఖ్యలో స్థానిక ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిని పేలపు పిండి పండగ కూడా అని అంటారు. ఈ రోజు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జొన్నలను వేయించగా వచ్చిన పేలాలను పిండిగా చేసి అందు తీపి పదార్థాలను కలిపి దేవుడికి తొలి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం కుటుంబ సభ్యులందరికీ సత్తుపిండిని పంచుతారు. ఎంతో పోషక విలువలు ఉన్న ఈ సత్తు పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిదని పూర్వీకులు తెలుపుతారు. ఈరోజు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకూడదని ఆరోగ్యానికి హాని కలుగుతుందని పలువురు వేద పండితులు తెలిపారు. రాశులు ఫలాలు ఈరోజుతో కొందరికి మారతాయని అందరికీ మహర్దశ కలుగుతుందని మరికొందరికి సాధారణంగా ఉంటుందని తెలిపారు.
Spread the love