నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామంలో శ్రీ కాశీ లింగేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పండుగ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు వైభోవపేతంగా బుధవారం నిర్వహించారు.ఆలయ అవరణంలో
నిర్వహించిన శివపార్వతుల కల్యాణోత్సవం కన్నులపండువగా..వేదాలతో కమనీయంగా నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో హజరై ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెద్లించుకుని దర్శనం చేసుకున్నారు.అనంతరం కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు అన్నదానం నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో మహా శివరాత్రి వేడుకలు..
మండలంలోని అయా గ్రామాల్లోని ప్రజలు మహా శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.మండల కేంద్రంలోని ఏకశిల గుట్టపై పంచాయత శివాలయం,బురుజు వద్ద శివాలయం, గుండారం,తోటపల్లి గ్రామాల్లోని పురాతన శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మహా శివరాత్రి వేడుకలను జరుపుకున్నారు.