కామారెడ్డి గొల్లవాడకు చెందిన కొట్టూరి లక్ష్మీ స్వరూప, (50) ఈ నెల5న ఉదయం 5 గంటల సమయంలో ఇంట్లో నుండి బయటకు వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదు. ఆమె గురించి చుట్టుపక్కల వెతికిన ఆమె భర్త అయిన కొట్టురి సంపత్ పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేశామని కామారెడ్డి ఎస్ హెచ్ ఓ చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈమెకు కల్లు తాగే అలవాటు ఉండడము, ఆ విషయంలో భర్తతో మూడు రోజుల కిందట చిన్న గొడవ జరగడం వల్ల ఆమె చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళినట్టుగా అనుమానిస్తున్నట్లు ఆమె భర్త చెప్తున్నాడన్నారు. ఈమె ఆచూకీ తెలిసిన ఎవరైనా కూడా పట్టణ పోలీస్ స్టేషన్ కామారెడ్డి పట్టణ సిఐ 8712686145, 8712666242 నెంబర్లకు తెలియపరచలని ఆ ప్రకటనలో తెలిపారు.