గ్రామంలో చెత్త పేరుకుపోయిన పట్టించుకుంటలేరు ? 

– బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తిని ప్రశాంత్ గౌడ్ 
నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలం రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్ ని గ్రామపంచాయతీ సిబ్బంది చెత్త పేరుకుపోయిన పట్టించుకుంటలేరని బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తిని ప్రశాంత్ గౌడ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ, గ్రామంలో చెత్త పేరుకు పోతే పట్టించుకునే నాధుడే లేడని అన్నారు. అలాగే  మురుగుకాల్వలలోని మురికి నీళ్లు రోడ్లపైకి రావడం జరుగుతుందని, కాలువలను శుద్ధి చేయడంలేదనీ చెత్త మొత్తం పేరుకుపోయి ఉంటుందని ఎన్నిసార్లు చెప్పినా కూడ పట్టించుకున్న పాపాన లేదని పోలేదని ఆయన అన్నారు. అదేవిధంగా గ్రామంలోని చేతి పంపు (బోరింగ్) చెడిపోయిన మరమ్మత్తులకు నోచుకుంటలేదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయన వెంట అల్లి రమేష్, పున్నం మణితేజ, కట్టెకోళ్ల సాయి ఉన్నారు.
Spread the love