పదెళ్ళయిన హుస్నాబాద్ లో ఏ మార్పు లేదు

– బీజేపీ నియోజకవర్గ నాయకులు బొమ్మ శ్రీరామ్ 
నవ తెలంగాణ- హుస్నాబాద్ రూరల్:
హుస్నాబాద్ లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ గెలిచి పదెళ్ళయిన హుస్నాబాద్ అభివృద్ధిలో ఎలాంటి మార్పు కనబడటం లేదని బీజేపీ నియోజకవర్గ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆరోపించారు. శనివారం హుస్నాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గౌరవెల్లి భూ నిర్వాసితులు హక్కుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారని అన్నారు. నిర్వాసితులు కడుపుమంటతో ఉంటే బీఆర్ఎస్ నాయకులు గౌరవెల్లి ప్రాజెక్టు కట్టపై గొర్రెలు కోసుకొని పండుగలు చేశారన్నారు. నిర్వాసితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి .. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో అడుగు పెట్టాలన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్లో కాంట్రాక్టర్ డబ్బుల కోసం నీటిని వదిలారన్నారు. ధన అధికార బలంతో చేస్తున్న అక్రమాలను ప్రజలు చూస్తున్నారని అన్నారు. హుస్నాబాద్ లో బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుపు పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, దొడ్డి శ్రీనివాస్ , రామంచ మహేందర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, గొల్లపల్లి వీరాచారి తదితరులు పాల్గొన్నారు.
Spread the love