
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : సస్పెక్ట్ ల పై హిస్టరీ షీట్స్ మెయిన్టైన్ చేస్తున్నామన్నామని,శాంతి భద్రతలకు, ప్రజల స్వేచ్చకు భంగం కలిగేలాగా ప్రవర్తించ కూడదని శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ పరిధిలో ఉన్న కేడి, డిసి, రౌడీ సస్పెక్ట్ లకు సత్ప్రవర్తన పై శ్రీ శ్రీనివాస్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి దొంగతనము ఇతర కేసులలో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన వారిపై హిస్టరీ షీట్స్ ఉన్న వారి యొక్క జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నామన్నారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు. నేర ప్రవృత్తి ప్రవర్తనను బట్టి హిస్టరీ షీట్స్ తొలగించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంచి ప్రవర్తనతో జీవించాలని తెలిపారు, కేడి, డిసి, రౌడీ, సస్పెక్ట్ లు సత్ప్రవర్తనతో ఉన్నవారికి పోలీసుల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎటువంటి గొడవలు సృష్టించడం వ్యక్తులను రెచ్చగొట్టడం , గొడవలు, అల్లర్లు, ఆవాంచనీయ సంఘటనలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు . నేరస్తుల కదలికలపై పూర్తి నిఘా పెంచడం జరుగుతుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు, శాంతియుత వాతావరణానికి భంగం కలిగేస్తే కఠిన చర్యలు తీసుకొవడం జరుగుతుందని తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దని సూచించారు. ఆన్లైన్ గేమ్స్ మరియు బెట్టింగ్ ఆడి జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎస్ఐ తోట మహేష్, కోహెడ ఎస్ఐ అభిలాష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.