ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు..

– కలిసి అభివృద్ధి చేద్దాం..
– మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పేరిక శ్రీనివాస్ 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
భూతగాదాల్లో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పేర్క శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బాన్సువాడ నియోజకవర్గంలో పలు తగాదాల్లో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పలు సందర్భాల్లో ఆరోపణలు చేయడం జరిగిందని, ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ఖండించారు. నసురుల్లాబాద్ మండలం నేమిలి గ్రామ శివారులో భూమి  సమస్యలతో గత ఆరు మాసాల నుండి ఇరువురు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనితో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి కేసులు నమోదు చేసుకున్నారు. ఈ తగాదాకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని వారి వ్యక్తిగత సమస్యని ఆ సమస్యను రాజకీయం చేయడం తగదని ఆయన హితవో పలికారు. నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో కలిసి పని చేసేందుకు తమ అంత సిద్ధంగా ఉన్నామన్నారు. నసురుల్లాబాద్ మండల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో మండల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఇందులో ఒకరు పెద్ద ఒకరు చిన్న అని తేడా లేకుండా పాత కాంగ్రెస్ నాయకులతో తాము కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందులో వర్గాలు ఉన్నాయని ప్రచారం చేయడం సరికాదు అన్నారు. వీరి వెంట నసురుల్లాబాద్ ఎంపీపీ పాల్త్య విఠల్, జిల్లా కోఆప్షన్ మెంబర్ మజీద్, మాజీ ఎంపిటిసి కంది మల్లేష్, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ చుంచు సాయిలు, సీనియర్ నాయకులు ప్రతాప్ సింగ్, సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love