కార్పోరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దందా నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తెవాలి

– విద్యారంగంలో వ్యాపార ధోరణి ప్రమాదకరం, కార్పోరేట్ విద్యావిధానం, విద్యలో అసమానతలు పెంచుతుంది; జస్టిస్ బి చంద్రకూమార్.
– ఫీజులు నియంత్రణ చట్టసాధనకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం,ఐక్య ఉద్యమాలు, తీర్మానం ప్రవేశ పెట్టిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు.
– కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాన్ని అమలు చేసి విద్యారంగాని ప్రక్షాళన చేయాల,ఫీజులను నియంత్రణ చేయాలి, ఎస్ఎఫ్ఐ రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్ధి ,ప్రజా సంఘాలు నాయకులు
నవతెలంగాణ-హైదరాబాద్: భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో “తెలంగాణ రాష్ట్రంలో కార్పోరేట్, ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులు నియంత్రణ -నియంత్రణ చట్టం -ఆవశ్యకత” అనే అంశంపై, చట్ట సాధనకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు గా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి చంద్రకూమార్ లు మాట్లడారు.
రానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో చట్టం ప్రవేశ పెట్టాలి: ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కార్పోరేట్, ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాలలో చట్టం ప్రవేశ పెట్టి ఫీజులను నియంత్రణ చేయాలని అన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో చాలా చోట్ల అనుమతులు లే0కుండా సిబిఎస్ఇ, ఐ.బి.ఐసిఎస్ఇ, ఐజీసిఎస్ఇ ,లాంటి పేర్లతో నూతన కర్య్కులమ్ పేరుతో లక్షలాది రూపాయలు ఫీజులు దండుకుంటున్నాయి. కనీసం ప్రమాణాలు పాటించకుండా, ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇచ్చి, ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించి, నిధులు ఇచ్చి బాగుపర్చితె ప్రభుత్వ విద్యాసంస్థల ముందు ఎంత పెద్ద కార్పోరేట్ అయినా నిలబడవని అన్నారు. ప్రైవేట్ వర్శీటీలు, ఉన్నత విద్యాసంస్థలకు ఉన్న ఫీ రెగ్యూలేషన్ పాఠశాల విద్యలో ఎందుకుండవని ప్రశ్నించారు. పాఠశాల విద్యలో కూడా ఫీజులను నియంత్రణ చేయడానికి చట్టం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీలో ఈ చట్టం ప్రవేశ పెట్టి అమలు పర్చాలని కోరారు.

 విద్యలో వ్యాపార ధోరణి ప్రమాదకరం, కార్పోరేట్ విద్యావిధానం అసమానతలు పెంచుతుంది, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకూమార్
కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల సామాజిక స్ఫృహతో కాకుండా ధనార్జన, వ్యాపార కాంక్షతో చదువు చెబుతాయని ఈ విధానం వల్లన అసమానతలు పెరుగుతాయని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకూమార్ అన్నారు. కార్పోరేట్ సంస్థలు ఎ.సి.గదులకు ఒక ఫీజు, నార్మల్ గదులకు మరో ఫీజు తీసుకుని విద్యార్ధులను. చదువులు కోసం విభజన కాకుండా కట్టే ఫీజులు, డబ్బులు బట్టి విభజన చేసి అసమానతలు పెంచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చరిత్ర పరిశీలన చేస్తే ఎన్నోచట్టాలు వచ్చిన అమలు మాత్రం పూర్తిస్థాయిలో లేదని అన్నారు. సుప్రీం గైడ్లైన్స్ విద్యావిధానం గురించి ఉన్నాయని అనేక కేసులు ఫీజులు గురించి ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం వర్సెస్ టి.ఎ.పాయ్ కేసులో ప్రైవేట్ విద్యాసంస్థలు లాభాలు లేకుండా సేవాధృక్ఫధంతో పని చేయాలని సుప్రీంకోర్టు తెలిపిందని చెప్పారు. అందుకే సామాన్యులకు విద్యా.అందుబాటులో ఉండాలంటే రాష్ట్రంలో ఫీజులను నియంత్రణ చెసే వ్యవస్థ ఉండాలని తెలిపారు. విద్యార్ధి సంఘాలు చేసే ఈ పోరాటంలో కలసి నడుస్తామని తెలిపారు.
ఫీజుల నియంత్రణకై రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు ,ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
తెలంగాణ రాష్ట్రంలో ఫీజులు నియంత్రణ చట్టం సాధనకు ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని,భవిష్యత్ కార్యచరణ తీర్మాణాని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ప్రవేశ పెట్టారు. రాష్ట్రంలో ఫీజులు నియంత్రణ కోసం గత ప్రభుత్వం మంత్రుల ఉపసంఘం, ఫ్రో: తిరుపతిరావు కమిటీ వేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ,వారి అనుయాయులు ప్రైవేట్, కార్పోరేట్ సంస్థలు భాగమై నడుపుతూ బిఆర్ఎస్ లీడర్లే కార్పోరేట్ సంస్థలకు ఎర్ర తీవాచీ పరిచి వెల్కమ్ చెప్పారని అన్నారు. దేశంలో 15.రాష్ట్రలలో ఫీజులను నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకుని వచ్చాయని తెలంగాణ రాష్ట్రంలో కూడా నూతన ప్రభుత్వం ఈ దిశగా చట్టం. చేయాలని దానికోసం ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలిపారు.
– బడ్జెట్ స్కూల్స్ ను ప్రభుత్వ నియంత్రణ చట్టంలో ప్రత్యేక కేటగిరీ గా చేర్చాలి,ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యాక్షులు ఎస్.మధు సూదన్,
రాష్ట్రంలో బడ్జెట్ పాఠశాలలు 9 వెల పైచిలుకు ఉన్నాయని వాటిలో కార్పోరేట్, సెమీ కార్పోరేట్ తరహాలో ఫీజులు లేవనీ. వాటి సమస్యల పరిష్కారానికి ఫీజు నియంత్రణ చట్టంలో ప్రత్యేక కేటగిరీలుగా చేర్చాలని ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యాక్షులు ఎస్.మధు సూదన్ తెలిపారు.
ఫీజులను దండుకుంటున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని, విద్యా కేంద్రాలను అక్షరాలు అమ్మె దుకాణాలు క్రింద మార్చిన కార్పోరేట్ సంస్థలు పుట్టగొడుగుల్లా సంస్థలను అపార్ట్మెంట్ లలో నడుపుతూ తల్లిదండ్రులను దోచుకుంటున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు,డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు.
నియంత్రణ చట్టసాధనకు పోరాటంలో కలిసి వస్తాము: ప్రజా, విద్యార్ధి సంఘాలు నేతలు
రాష్ట్రంలో జూన్ వచ్చిందంటే కార్పోరేట్ శ్రీచైతన్య, నారయణ లాంటి సంస్థలు దోపిడీ మొదలవుతుంది అని ఇప్పుడు ఆ జాబితాలోకి అనేక విద్యాసంస్థలు చేరాయని. ఎంట్రన్స్ టెస్టులు పెట్టి అడ్మిషన్లు, ఫీజులు నిర్ణయించడం,ఇంటర్నేషనల్, సిబిఎస్ఇ పేరుతో లక్షలాది రూపాయలు దోపిడీ, పాఠశాలలోనే టై‌,బెల్ట్, యూనిఫామ్, షూ, స్టేషనరీ ,అమ్ముతున్నారని. హైదరాబాద్ నగరం లాంటి చోట లక్షలాది రూపాయలు ఫీజులను దండుకుంటు విద్యావ్యాపారం చేస్తున్నారని వాటిని నియంత్రణ చేసేందుకు ముందుకు వచ్చి ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రజాసంఘాలు నాయకులు, విద్యార్ధి సంఘాలు నేతలు మాట్లడారు. వందన సమర్పణ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి చేశారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాపని నాగరాజు(ఐ.ఎస్.యుజాతీయ అధ్యక్షుడు), పుట్టా లక్ష్మణ్, మణికంఠ రెడ్డి(ఎ.ఐ.ఎస్.ఎఫ్రాష్ట్ర అధ్యక్ష్యా, కార్యదర్శులు), రామకృష్ణ, ఆజాద్ (పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్ష్యా, ప్రధాన కార్యదర్శులు), నితీష్(ఎ.ఐ.డి.ఎస్.ఓ రాష్ట్ర నాయకులు), సాంబ( పి.డి.ఎస్.యు రాష్ట్ర కార్యదర్శి),ఎ.విజయ్(పి.డి.ఎస్.యు. విజృంభణ రాష్ట్ర కార్యదర్శి),నాగరాజు(పి.డి.ఎస్.యు. జిల్లా కార్యదర్శి) ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షులు రజనీకాంత్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎం.మమత,డి.కిరణ్, బి.శంకర్ ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష్యుడు లెనిన్ ,రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రమేష్ ,రమ్య చౌహాన్ ,నగర ఎస్ఎఫ్ఐ నాయకులు స్టాలిన్,ప్రశాంత్, శ్రీమాన్, సహాన, సుష్మ,విఘ్నేష్, చరణ్ శ్రీ,సుమశ్రీ, అజయ్,సాత్విక్ మరియు ఎన్.పి.ఆర్.డి. రాష్ట్ర కోశాధికారి ఆర్.వెంకట్, హైదరాబాద్ జిందాబాద్ నాయకులు వీరన్న, తల్లిదండ్రులు సంఘం నాయకులు, మల్లేష్, మరియు పలు ప్రజాసంఘాలు నాయకులు ,విద్యార్థులు ,
తదితరులు పాల్గొన్నారు.

Spread the love